Featured post

SMART CITY

  A smart city uses digital technologies or information and communication technologies (ICT) to enhance quality and performance of ...

Saturday, 17 October 2015

ప్రకృతిలో లభ్యమయ్యే పుట్టగొడుగుల ఆకారాన్ని పోలి ఉంటాయి.ఎడెనిమిది రోజులు తాజాగా ఉంటాయి.తక్కువ పెట్టుబడి, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానంతో వీటి పెంపకం చేపట్టవచ్చు.నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.ప్రజలకు పోషక విలువలున్న ఆహరం లభిస్తుంది. వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియెగం జరుగుతుంది.వాతావరణ కాలుష్యం నివారించవచ్చు.

ప్రకృతిలో వేల రకాల పుట్టగొడుగులున్నాయి. వీటిలో అతికొద్ది రకాలను మాత్రమే ఆహారానికి అనుకూలమైనవిగా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు . అన్ని రకాలను ఆహారంగా తీసుకునేందుకు అవకాశం లెదు. పుట్టగొడుగుల్లోని పోషక విలువలను గమనించి సంవత్సరం పొడవునా వీటిని పండించే విధానాన్ని శాస్తజ్ఞులు అధ్యయనంచేసి కొన్ని రకాలను ఎంపిక చేశారు. వాటిలో ముఖ్యమైనవి :

1)బటన్ (తెల్లగుండి) పుట్టగొడుగులు
2)అయిస్టర్(ముత్యపుచిప్ప)
3)మిల్కి (పాల పుట్టగొడూగులు)
4)చైనీస్ (వరిగడ్డి పుట్టగొడుగులు) ముఖ్యమైనవి.

1)బటన్: ఈ రకం పుట్టగొడుగుల పెంపకానికి 15-18 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత, అధిక సాంకేతిక పరిజ్ఞానం, అధిక పెట్టుబడి అవసరమైనందున వీటి పెంపకం సాధారణ పెంపకందారులకు సాధ్యం కాదు.
2)అయిస్టర్(ముత్యపుచిప్ప):వీటి పెంపకానికి 25-32 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత, 75 నుంచి 85 శాతం తేమ అవసరం. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు వీటి పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీటికి తక్కువ పెట్టుబడి సాధారణ సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుంది. అందుకే నిరుద్యోగులు,చిరుద్యోగులు సాధారణ గృహిణులు,ఉద్యోగ విరమణ చేసిన వారు ఎవరైనా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు.
3)మిల్కి (పాల)పుట్టగొడుగులు : ఈ పుట్టగొడుగుల పెంపకం కూడా కొద్దిపాటి మార్పులతో అయిస్టర్ పుట్టగొడుగుల పెంపక్కన్ని పోలి ఉంటుంది. వీటికి 30-35 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత, 85 నుంచి 95 శాతం తేమ, తగిన వెలుతురు అవసరం. మార్చి నుంచి అక్టోబరు వరకు వాతావరణం అనుకూలిస్తుంది.

వ్యాపారరిత్యా నిరవధికంగా ఎడాది పొడవునా పుట్టగొడుగుల పెంపకం చేపట్టే వారు మార్చి నుంచి అక్టోబరు వరకు పాలపుట్టగుడుగులు,నవంబరు నంచి ఫిబ్రవరి వరకు అయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం వల్ల లాభసాటిగా పండించవచ్చు.

No comments:

Post a Comment