‘ప్రాపంచికత’ - ‘ఆధ్యాత్మికత’ రెండూ ఒక్కటేనా? వేరువేరా?"
పత్రీజీ: సత్యం తెలుసుకోనంత వరకూ అవి రెండూ వేరు వేరే. సత్యం తెలిసిన తరువాత అవి రెండూ ఒక్కటే. "ప్రాపంచికత" అంటే ప్రపంచంలో మనం జీవించే తీరుతెన్నులు. "ఆధ్యాత్మికత" అంటే ఆత్మస్ఫూర్తితో మనం జీవించే తీరుతెన్నులు. ఈ ప్రపంచంలో పుట్టడం, జీవించడం, మరణించడం - ఇదంతా ఆత్మ యొక్క ఎంపికే. ఆధ్యాత్మికత తెలిసినవాడికే "ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండూ ఒక్కటే" అని తెలుస్తుంది. ఆధ్యాత్మికత తెలియని వారే "ఆధ్యాత్మికత వేరు ప్రాపంచికత వేరు" అని భ్రమ పడుతూ వుంటారు. ప్రాపంచికంలో వుండే ప్రతి చిన్న విషయం ఆధ్యాత్మికతలో మహా విషయమే. ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి .. ఇదంతా ఆధ్యాత్మిక విజ్ఞాన విషయమే. ఆధ్యాత్మికత అన్నదే ప్రాపంచికతకు అర్థవంతమయిన చుక్కాని. ఒకానొక నావ యొక్క ప్రధానభాగం చుక్కాని గదా, ప్రాపంచికత యొక్క అత్యంత ప్రధాన భాగమే ఆధ్యాత్మికత. శాంతిమయ, ప్రగతిమయ ప్రాపంచికత కోసమే ఆధ్యాత్మికత.
No comments:
Post a Comment